Friday, 23 September 2016

Chitti Nadumune Choostunna



చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపక్కలేమౌతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

నంగనాచిలా నడుమూపి నల్లత్రాచులా జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది
చీమలాగా తెగ కుడుతుంది పాము లాగా పగ పడుతుంది కళ్ళు మూసినా ఎదరేవుంది
తీర చూస్తే నలక అంత నల్లపూస  ఆరా తీస్తే నను నమిలేసే ఆశా
కన్నెరగా కందిదిలా నడువొంపుల్లో నలిగీ 
ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగీ

ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే నడుము తడమనీ నన్నొకసారీ
ఉరిమి చూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే ఉరిమి చెవిని చెబుతానే సారీ
హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణీ
ఆ కోరిక కడతీరగ మరుజన్మ ఎందుకే రాణీ


Le Le LeLe Ivaale Lele



లే లే లే లే  ఈ వాలే  లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే 
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే/లేలేలే/

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే, సుడిగాలై చుట్టేయాలి లే లే
గొడుగల్లే పనిచేయాలి నిన్నే కదిలిస్తుంటే, వడగల్లే పనిపట్టాలి లే లే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి/2/ 
అణిచేస్తే ముంచేయాలి లే 
నేలల్లే ఉండాలి అందరి భారం మొయ్యాలి, విసిగిస్తే భూకంపాలే చూపాలే
లే లే లే లే ఈ వాలే లే లే లే లే లే  లే ఈ రోజల్లే లే లే 

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉందీ, చెడ్డోల్లకి చెడు చేయడమే మంచి
చేదుంది తీపి ఉంది భేధం వేరే ఉంది చేదన్నది ఉన్నప్పుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది/2/ ఎటుకైనా గమ్యం ఒక్కటే లే లే
బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే

Chiguraaku Chaatu Chiluka


చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
చిగురాకు చాటు చిలకా తను నడవదా ధీమాగా 
అనుకోని దారి గనకా ఈ తికమక తప్పదుగా
తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
ఐతే అది తేలనిదే అడుగుపడదుగా
చిగురాకు చాటు చిలకా ఆ అలజడి ప్రేమేగా 
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా

చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా  తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా
సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా  తేలనిగుట్టు తేనెపట్టు కదపలేకున్నా
వణికే నా పెదవుల్లో తొణికే తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ
తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నదీ
చిగురాకు చాటు చిలకా తను నడవదా ధీమాగా
 అనుకోని దారి గనకా ఈ తికమక తప్పదుగా

ఎక్కడనుంచో మధురగానం మదిని మీటింది  ఇక్కడ నుంచీ నీ ప్రయాణం మొదలు అంటోంది
గలగలవీచే పిల్లగాలి ఎందుకాగింది కొంపలు కూల్చే తుఫానుచ్చే సూచనేమో ఇది
వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయని మైకం తెంచుతున్నదీ
దారే తెలియని దూరం తీరే తెలపనీ తీరం తనలో కలవరమేదో రేపుతున్నదీ




Palike Gorinka Choodava Naa Vanka



పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా 
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటిన రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా

పగలే ఇక వెన్నెలా
పగలే ఇక వెన్నెలా వస్తే నేరమా రేయిలో హరివిల్లు వస్తే పాపమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరిచేరవా
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా

నా పేరే పాటగా కోయిలే పాడనీ, నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం
భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరనీ
రేపు అన్నదీ దేవులకీ, నేడు అన్నదీ మనుషులకు 
బ్రతుకే బ్రతికేందుకూ
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా 
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటిన రోజా నేడే పూయునే



Gandapu Gaalini Talupu Aaputa Nyaayama



లేదని చెప్పు నివిుషము చాలు
వేదన మాత్రం తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలిపా ఒక గడియే చాలులే
ఆదే నేను ఋజువే చేయా నూరేళ్ళు చాలవే
లేదని చెప్పా నిమిషాము చాలు, వేదన మాత్రం తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే /గంధపు/

హృదయమొక అద్దమనీ, నీ రూపు బింబమనీ
తెలిపేను హృదయం నీ సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేమీ లేదు సఖీ
అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక  వేటాడొద్దే
లేదని చెప్పా నిమిషాము చాలు, వేదన మాత్రం తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా

తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేదీ
వాసనలు వీచే నీ కురులే సఖీ..
లోకాన చీకటైనా వెలుగున్నా చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ..
విశ్వ సుందరీమణులే వచ్చి నీ పాదపుాజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగీ నా తోడుగ రావే


ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా
ఏమి చేయమందువే 






Doboochu laatelara Gopaala



దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా/2/
ఆ యేటి గట్టునేనడిగా, చిరు గాలి నాపి నేనడిగా/2/
ఆకాశన్నడిగా బదులే లేదూ/2/
చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా/2/
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నాకిక ఆశలు లేవయా ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ , చేరగ రార
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

గగనము వర్షించ గిరినెత్తి కాచావూ
నయనాలు వర్షించ నన్నెట్టా బ్రోచేవు పోవున కన్నె నీ మతమా
నేనెక్క స్ర్తీనే కదా గోపాలా అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు, అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా  ఊపిరి నీవై ప్రాణం పోనీకుండా ఎప్పుడూ నీవే అండ 
 కాపాడా రారా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా


Sunday, 18 September 2016

Mundhu Nuyya



ముందు నుయ్యా, వెనుక గొయ్యా
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయా
ఏటిలోకి లాగేనయ్యా

కూతకొచ్చిన కుర్రావాడు
కూలబడుతూ లేస్తున్నాడు
బక్కపలచ పిల్లగాడూ
భారమెత్తుకుంటున్నాడూ
దిక్కుతోచక ఉన్నాగానీ
ఒక్కడే అవుతున్నా గానీ
మనసునేమో  ఇక్కడ వదిలీ
మనిషి మాత్రం నడవాల్సిన గతీ
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంతా చిత్రంరా /2/

వీడి వీడి తస్సదియ్యా 
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయా
ఏటిలోకి లాగేనయ్యా

ఊరు కొత్తా నీరు కొత్తా 
ఉండవలసినా తీరు కొత్తా
ఎదురయ్యా ప్రతి వారు కొత్తా
ఎదురు చూస్తా ఎట్టా ఎట్టా
చిలక పక్కన లేకుండానే 
గోరువంకా ఎగిరేదెట్టా
పౌరుషానికి పోయినప్పుడు
పోరు తప్పదు అది తెలిసిన బతుకు
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంతా చిత్రంరా... /2/

చూడు చూడు చిన్నవాడు 
ప్రేమలో పడిపోయాడు
లోకమేదో చూడనోడు
లోతులో దిగిపోయాడు

భారమేమే బోలెడంతా
రూపమేమో వేలెడంతా
సమస్యమో సింధువంతా
వయసుయేమో బింధువంతా
ఆశయం ఆకాశమంతా
అనుభవం మరి అంతంతా
పరువు కోసం పేరు కోసం 
ప్రాణమంటి ప్రేమ కోసం
జారిపోయిన విలువల కోసం
విలువ కలిగిన గెలుపు కోసం
పట్టుదలనే పెట్టుబడిగా 
పెట్టదలచిన పిల్లవాడికి
ఎంత కష్టం ఎంత కష్టం 
ఎంతెంతా కష్టంరా..














Kotha Kotha Bhasha



కొత్త  కొత్త భాష కొత్త ప్రేమ భాష
నీకు నాకు మద్యా ఒ. ఒ. ఓ..
అక్షరాలు లేవూ,డిక్షనరీలు లేవు
గ్రామరైనా లేదే   ఒ.ఓ..
నీ నా కన్నుల్లోనా నీ నా నవ్వుల్లోనా
మౌనం మోగించే భాష

లెట్మి లెట్మి  సే
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo
Hey I Love You

MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo
Hey I Love You

హో....   పిచ్చి పిచ్చి భాష
      అచ్చమైన భాష
         అచ్చు వేయలేమే 
   ఆశలెన్నో ఉన్నా, కోరికెంతో ఉన్నా
చేర వెయ్యగలదే  ఓహో...
   నీ నా నీడల్లోనా 
   నీ నా శ్వాసల్లోనా
  నిండే నింగైనా భాష

లెట్మి లెట్మి  సే
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo
Hey I Love You

TU Touch You Oo
HU Hug  You Oo
LU Love You Oo
Hey I Love You

హే ముద్దు ముద్దు భాష 
ముచ్చటైనా భాష
ముందుకెళ్లమందీ  హో...
దూరమైనా కొద్దీ
దగ్గరవుతూ ఉందీ
దారి చూపుతుందీ హో...
నీ నీ గుండెల్లోనా నీ నీ ప్రాణంలోనా
పొంగే ప్రాయాల భాష

లెట్మి లెట్మి  సే
NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
Hey I  Love You Oo

NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
Hey I  Love You Oo








Neekosam vastha



నీ కోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొక సారి చూస్తే చాలు
ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లే నిను దాచుటకూ
నీడలాగా నడిచేస్తా
నువ్వెరైనా కానీ 
ఇక నాకు సొంతమే
నువు ననువీడినా  క్షణమే నా ఊపిరాగునే
నీ కోసం వస్తా 
నా ప్రాణం ఇస్తా

ఎవరేమి అన్నారు, నన్నే చంపి వేసినాను
నీలోనే సగమై  బ్రతికే ఉంటా
నేనెక్కడున్నాను, నీ పక్కనున్నాను
నీ పేరే వినిపిస్తే, తిరిగిచూస్తా
నా ప్రాణం వస్తున్నా 
నీకు ప్రేమ అనీ
ఇక మరణం ఎదురైనా 
నేను చావలేనులే....

నీ కోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొక సారి చూస్తే చాలు
ఏమడిగిన చేస్తా
జ్ఞాపకమల్లే నిను దాచుటకూ
నీడలాగా నడిచేస్తా
నువ్వెరైనా కాని 
ఇక నాకు సొంతమే
నువు ననువీడినా క్షణమే నా ఊపిరాగునే



Vanda Devulle




వంద దేవులే కలిసొచ్చినా 
అమ్మా నీ లాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా 
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా

నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా..
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మైనా సరిపోదమ్మా..
నడిచేటి కోవెల నీవేలే..

వంద దేవులే కలిసొచ్చినా
అమ్మా నీ లాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా

పగలైనా రాత్రైనా జాగరాలు
పిల్లల సుఖమే మెడహారాలు
పగలైనా రాత్రైనా జాగరాలు
పిల్లల సుఖమే మెడహారాలు
దీపములా కాలి,   వెలుగే పంచేనూ
పసి నవ్వులే చూసీ, బాధే మరిచేనూ
నడిచేటి కోవెల అమ్మేలే

వంద దేవులే కలిసొచ్చినా 
అమ్మా నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మైనా సరిపోదమ్మా..
నడిచేటి కోవెల నీవేలే