ఆకాశవీధిలో అందాల జాబిలి
వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీదిలో అందాల జాబిలి
వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
జలతారు మేలిమబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే /ఆకాశ/
జడివాన హోరుగాలి సుడిరేగి రాని జడిపించబోని
కలకాలం నీవే నేనని పలు బాసలాడి చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటేనే నయగారం చేసేనే/ఆకాశ/
ఆకాశ వీధిలో దడ దడ ఉరుములు మోగెనే
జడివాన ముంచుకొచ్చే వడగండ్లు రాలెనే కడగండ్లు కల్గెనే/2/
No comments:
Post a Comment