పెళ్ళి చేసి చూపిస్తాం
మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం/2/
బందర్ నెల్లూర్ హైదరాబాద్ , జిందాబాద్
మద్రాస్ గిద్రాస్ మననం చేసి , శెబ్బాష్
అవసరమైతే ఏంతైనా అడిగినా కట్నం మొహానవేసి
పెళ్ళి చేసి చూపిస్తాం
మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం
కోటు పొంట్లాం వాచీ గొలుసు వాటమైన క్రాఫింగ్ కలర్స్ రైట్ ఆల్ రైటు
పెళపెళ లాడే పెళ్ళికొడుకునే జబర్దస్తిగా పట్టుకువచ్చి
పెళ్ళి చేసి చూపిస్తాం
మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం
బజ్జీ బొండా బర్ఫీ లడ్డూ
గారె బూరె ఇడ్లీ పెసరట్ట్
గంగాళాలతో కాఫీ పోసి ఘమఘమగా విందులు చేసి
పెళ్ళి చేసి చూసిస్తాం
మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం
రంగుల రంగుల పూసల పల్లకీ
వాకా బాండ్ భజంత్రీలతో
హవల్ రైట్ గా ఢంకా కొట్టి
పెళ్ళి చేసి చూపిస్తాం
మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం
No comments:
Post a Comment