Saturday, 9 September 2017

VUNDILE MANCHI KALAM MUNDU MUNDUNA



ఉందిలే మంచికాలం ముందుముందునా....
అందరూ సుఖపడాలి నందనందనా....
ఉందిలే మంచికాలం ముందుముందునా...
అందరూ సుఖపడాలి నందనందనా....

ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీ వంతు అందుకో
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీ వంతు అందుకో
అదిగో ఆ రోజు కలదు నీ ఎదుటే...ఆ....
 నీవే  రాజువటా ...ఆ...
ఉందిలే మంచికాలం ముందుముందునా...
అందరూ సుఖపడాలి నందనందనా...

ఏమిటేమిటేమిటే మంచి కాలమం అంటన్నావ్  ఎలాఉంటదో కొంచెం విశదంగా చెప్పూ
దేశ సంపదా పెరిగే రోజూ
మనిషి మనిషిగా బ్రతికే రోజూ
దేశ సంపదా పెరిగే రోజూ
మనిషి మనిషిగా బ్రతికే రోజూ
గాంధీ మహాత్ముడు కలగన్న రోజూ
నెహ్రు అమాత్యుడు నెలకొల్పు రోజూ
ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో....
అదిగో చూడు రేపో నేడో చిన్నయ్యో....
ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో....
అదిగో చూడు రేపో నేడో చిన్నయ్యో....

 భలే భలే బాగా చెప్పావ్ కాని అందుకు మనం
  ఏం చేయాలో అది కూడా  నువ్వే చెప్పూ
అందరి కోసం ఒక్కరు నిలిచి
ఒక్కరి కోసం అందరు కలిసి
అందిరి కోసం ఒక్కరు నిలిచి
ఒక్కరి కోసం అందరు కలిసి
సహకారమే మన వైఖరి అయితే 
ఉపకారమే మన ఊపిరి అయితే
పేద గొప్ప భేదం పోయి అందరూ
నీది నాదని వాదం లేక ఉందురూ
ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో
అదిగో చూడు నేడో రేపో చిన్నయ్యో

తియ్యగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశ వీధుల ఎదురే లేకుండా... 
ఎగురును మన జెండా

ఉందిలే మంచికాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందనా






1 comment: