Sunday, 26 September 2021

Shiva govinda govidna hari govinda govinda

 

 

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు

సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు

సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయా నమహ

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

 

తమ బాగు కోసమై తంటాలు పడలేరు

ఎదుటి కొంపకి ఎసరు పెడతారయా

పొరుగు పచ్చకి ఓర్వలేని వారి గతి

శ్రీమతే రామానుజాయా నమహా

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

 

పరుల కోసం త్వాగమొనరించు వారొకరు

పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు

పరుల కోసం త్వాగమొనరించు వారొకరు

పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు

ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి 

శ్రీ మద్రరమరమణగోవిందో 

హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద


కలిమి లేనన్నాళ్లు కలిసిమెలిసుంటారు

కలిమి చేరిననాడు టాటాలు చెబుతారు

కలిమి పెంచే కాయ కష్టజీవుల పని

శ్రీమతే రామానుజాయా నమహా

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

 

ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా

ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా

ఈనాడు కొసకవి వెంగళ్లప్ప మాట అక్షరాల జరిగి తీరేనయా

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద  

 




 

  


  

 

 

Sandhe Poddula Kaada

 

 

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో  ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో 


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో


కొండ కోనా జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలకకొట్టే వేళ
పిల్ల పాప నిదరేపోయే వేళ
కలలో కౌగిలై కన్నులు దాటాలా
ఎదలే పొదరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లు వయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో  ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

మల్లె జాజి మత్తు జల్లే వేళ
పిల్ల గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీైవె వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
అరెరెరే... ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది 



Anuvu Anuvuna velasina deva

 
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల

అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా

కనువెలుగై మము నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా


జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర వెలుగులు సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల

ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై మము నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల


జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా

కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా
 

 

Urakalai Godavari

 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
 రసమయం జగతి 
 ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 
  నీ ప్రణయ భావం నా జీవరాగం 
 నీ ప్రణయ భావం నా జీవరాగం 
 రాగాలు తెలిపే భావాలు నిజమైనవి 
 లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి 
 అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది 
  ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
 రసమయం జగతి 
 
  నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
 నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
 నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది 
 నీవన్న మనిషే ఈనాడు నాదైనది 
 ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది
  ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి  
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
  రసమయం జగతి
 

 

Sadiseyako Gaali

 
 
సడిసేయకో గాలి.. సడిసేయబోకే
సడిసేయకో గాలి.. సడిసేయబోకే
  బడలి ఒడిలో రాజు పవ్వళించేనే 
 సడిసేయకే... 
 
రత్నపీఠిక లేని రారాజు నా స్వామి 
 మణికిరీటము లేని మహరాజు గాకేమి
  చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే... 
  ఏటి గలగలలకే ఎగసి లేచేనే 
 ఆకు కదలికలకే అదరి చూచేనే 
 నిదుర చెదరిందంటే నేనూరుకోనే  
సడిసేయకే... 
  పండు వెన్నెలనడిగి పానుపు తేరాదే  
నీడ మబ్బులదాగు నిదుర తేరాదే
  విరుల వీవన బూని విసిరి పోరాదే సడిసేయకో గాలి.. సడిసేయబోకే 
 బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకో గాలి..
 

 

OHO MEGHAMALA CHALLAGA RAAVELA

 

 

ఓహో మేఘమాల నీలాల మేఘమాల  
చల్లగ రావేల మెల్లగ రావేల 
 చల్లగ రావేల మెల్లగ రావేల 
 మెల్లమెల్లగ రావేల 
  ఈ లీల దుడుకుతనమేల 
 ఈ లీల దుడుకుతనమేల 
 ఊరుకోవే మేఘమాల 
 ఊరుకోవే మేఘమాల
  ఉరుముతావేల మెరవగానేల  
చల్లగ రావేల మెల్లగ రావేల 
 
  ఓహో..... గూటిలోన రామచిలుక నిదురపోతోంది  
గూటిలోన రామచిలుక నిదురపోతోంది 
 చిలుక బెదిరిపోతుంది 
 ఊరుకోవే మేఘమాల 
 ఊరుకోవే మేఘమాల 
 ఉరుముతావేల 
మెరవగానేల  
చల్లగ రావేల మెల్లగ రావేల
 
  ఓహో... తియ్యతియ్యని కలలు కంటూ మురిసిపోతోంది  
తియ్యతియ్యని కలలు కంటూ మురిసిపోతోంది 
 మైమరచిపోతోంది  
ఊరుకోవే మేఘమాల 
 ఊరుకోవే మేఘమాల 
 ఉరుముతావేల మెరవగానేల 
 చల్లగ రావేల మెల్లగ రావేల చల్లగ రావేల మెల్లగ రావేల 
 ఓహో....
 

 

titla dandakam

 

 


 

 

ఒరే త్రాపీ… మహాపాపి కురూపి 
నిన్ను చూడంగనే వచ్చు హై లెవల్ బి.పి 
ముండమోపి జిరాఫి నిన్ను తెగ్గోస్తే లోకీనికే పిచ్చ హేపీ.. 
అంక ఛండాలుడా బంక బధిరాంధుడా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా.. 
  నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠ నాళంబు కక్కూస గొట్టంబు
 నీ కళ్ళలో కళ్ళు నీ బుర్రలో బురద నీ పల్కులే చెత్త… 
నీ జన్మ డ్రైనేజీ.. 
నువ్వో దగుల్బాజీ, ఏబ్రాసి, చప్రాసి, సన్నాసివి… 
  అశుద్ధ స్వరూప అబద్ద ప్రలాప పింగు బొంగైన పింజారిగా… 
 గొగ్గేసిన బచ్చా కొవ్వెక్కిన లుచ్ఛా పగిలేను నీ పుచ్చె తీరెను నా కచ్చ  
నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చె నిక్కచ్చిగా…  
భ్రష్టాతి భ్రష్ట పరాకాష్టకెళ్ళావు దుష్టత్వమందున్ ముదనష్టుడా, త్రాష్టుడా.. కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షయ రోగి ఉచ్చిష్టమా… 
డ్రైనేజి నురుగా దాన్లోని బుడగా అమీభా తుమీభా
 గుడ్లగూభపగులుతుంది గూభ మురిగిపోయిన అరబ్బీ మురబ్బా
 
  ఒరే పళ్ళకిచ్చీ అరే చిల్లి గోచీ నీ పిచ్చి పోగొట్టుగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెన్ టచ్ గా.. 
  ఒరే పాచి మొహమా, నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగ త్రాగు సోంబేరిగా.. 
  పెద్ద ఇడియట్ వి సద్ది పెసరట్టువి పిచ్చి టేస్టున్న శాడిస్టువి గజ్జి పాదాల మరుగుజ్జువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి.. త్రేలువి
ఒరే అక్కు పక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా.. 
  నువ్వు చుంచెలుక గొద్దెవి రాబందు రెట్టవి.. బొద్దింక కేశానివి  
సీమ్పంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకీకవి..
 నువ్వు చుంచు డాంకీవి యోచించు మంకీవి కుడితిలో చిట్టెలుకవి. మునిసిపాలిటి పందికి మూత్రపిండానివి ఎద్దు మొండానివి
 సృష్టిలో మొత్తంలో శుంఠావి
 ఒరె పేడ తట్టా… అరె చెత్త బుట్టా అరె గడ్డి పోచా అరె నార పీచా ఒరె తుప్పు మేకా అరె పంది తోకా ఒరె వానపాము ఇలా తొక్కుతాము ఒరె గౌడి గేదె ఇదే బడిత పూజ సెంటిమెంటన్నదే లేని ప్రెంటాసురా
 నిన్ను తిట్టంగ నేనెంతవాడన్, దురాత్మా.. 
ఏడేడు లోకాల భాషలకే శోషాచ్చి మూ ర్ఛిల్లురా 
మహాబండ బూతుల్ తలల్ వంచు నీ ముందు పాపాత్ముడా..  
 
రావరావో బోడి వెధవా రావ రావో అంట్ల వెధవా రావరావో చచ్చు వెధవా వెధవన్నర వెధవ ముప్పావు వెధవ పరిపూర్ణ వెధవ చావరా చావరా చావు చావు… థూ….
 
 


bava bavamaridi sarada padyam

 

అందమున చూడ రాముబంటైన వాడు
నాగరీకతకు  జముడు వాహనమునకు ఈడు
శుచికి హేమాక్షు చంపిన శూరు జోడు
వసుధలో లేడు మా బావ వంటి వాడు 
 

 

Alugutaye yerungani

 

 

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రువే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్.

Enno Yellu Gatinchi Padyam

 

ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌
కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌

 


 

ichchotane

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
అధికార ముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో కలిసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు

 


 

chelliyo chellako




చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

 

janda pai kapiraju

 

 

జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్
 

 
 

Thursday, 23 September 2021

Dharuni Rajya Sampada

 

 

ధారుణి రాజ్యసంపద మధంబున కోమలి కృష్ణజూచి
రంభోరుని జోరు దేశమున నుండగా పిల్చిన ఈ దురాత్ము
దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాబిఘాత
భగ్నోరుతరోరు జేయుదు సూయోధను ఉగ్ర రణాంతరంబునన్
కురువృద్దుల్ల్ గురువృద్ద భాందవులనేకుల్ చూచుచుండన్
మదోద్దురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్లైల రక్తౌఘ
నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్ 



 

 

Sunday, 19 September 2021

Sarva mangala Naama

 
సర్వమంగళ నామా సీతా రామా రామా 
సర్వమంగళ నామా సీతా రామా రామా
 సర్వ వినుత శాంతి ధాతా రామా రామా 
సర్వ వినుత శాంతి ధాతా రామా రామా
 మనసులోని మాయ మాపి రామా రామా 
మనసులోని మాయ మాపి రామా రామా
 మలుపుమా నీ మోము చూపి రామా రామా 
 నీవు నేనను భేద బుద్ది మాపి మాలో..
నీవు నేనను భేద బుద్ది మాపి మాలో..
  నిలుపుమా నీ జ్ఞాన దీప్తి రామా రామా 
మాలో నిలుపుమా నీ జ్ఞాన దీప్తి రామా రామా
 కామ క్రోధ లోభ మోహ పాశమ్ము లా
కామ క్రోధ లోభ మోహ పాశమ్ములా
  కడకు తోసి కావు వయ్యా రామా రామా
  ఏకశిలా పుర వాస సీతా రామా రామా 
ఏకశిలా పుర వాస సీతా రామా రామా
 లోకేశా బహురూప విలాశా కోదండా రామా 
లోకేశా బహురూప విలాశా కోదండా రామా 
రామకృష్ణ గోవింద నారాయణా 
 రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా 
 ప్రేమించి పాలించు నారాయణా  
రామకృష్ణ గోవింద నారాయణా
ప్రేమించు పాలించు నారాయణా 
 రామకృష్ణ గోవింద నారాయణా 
  రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా