Wednesday, 24 August 2016




నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురుచూపులో....
ఆవిరైనా నీ కన్నీళ్ళు.. ఆనవాళ్ళు ఈ సంకెళ్లు..
రాజ్యమా ఉలికిపడు..
మాహిష్మతీ సామ్రాజం అస్మాకం అజేయం..
ఆ సూర్య చంద్రతా రామ్ వర్ధతాం అభివర్ధతాం
ధుర్బేధ్యం ధుర్నిరీక్ష్యం సర్వశత్రు భయంకరాం
అశ్వాచతురంగ సైన్యం, విజయదాం దిగ్విజయదాం...
ఏకద్దురా దిగమధుర్దెయ్ భవతీ
యశ్యవీక్షణం తశ్య శీర్షం, ఖడ్గచిన్నం తతద రానా భూతయే
మాహిష్మతే గగనశీలే దురాజతే
నిరంతరం అస్వధ్యయ ఆదిత్యం నిహస్వర్ణ  సింహాసన ధ్యజం


మమతల తల్లీ ఒడి బాహుబలీ..
లాలాన తేలీ శతధవరాలీ..
ఎదలో ఒక పాలకడలి మధనం జరిగే స్ధలీ..

మహిష్మతి వరక్షాత్రకులి జిత క్షాత్రవ బాహుబలీ
సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళా కుశలీ
ఎదలో ఒక పాలకడలి మధనం జరిగే స్ధలీ..

లేచిందా ఖడించే ఖడ్గం,దూసిందా చేధించే బాణం
చదరనది ఆ దృడ సంకల్పం తానే... సేనై
తోచే....తల్లీ తన గురువు దైవం బల్లా తోనే
సహవాసం ధ్యేయం అందరీ సంక్షేమం రాజ్యం
రాజూ...తానే...ఓహో..
శాసన సమం శివగామి వచనం
సదసద్రణరంగం ఇలనం జననీ హృదయం
ఎదలో ఒక పాలకడలి మధనం జరిగే స్ధలీ...





పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటానురా
వేయి జన్మాలా ఆరాటమై, వేచి ఉన్నానే నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా... రెక్క విప్పిందే నా తొందరా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసిీ
నన్నిలా లాగింది నువ్వే హలా..
కబురులతో కాలాన్నీ కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బహుబంధాల పొత్తుల్లలో విచ్చుకున్నావే ఓ మల్లికా..
కోడె కౌగిళ్ళ పొత్తిళ్ళలో పురివిప్పింది నా కోరికా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువ్ నేను ఒక మేను కాగా
కోనలో ప్రతి కూన మురిసేనుగా
మరక్షణమే ఎదరైనా.. మరణము కూడా పరవశమే
సాంతము నే నీసొంతం అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిల్లలో చిందులేసింది సిరివెన్నెలా
ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటానురా







Dheevara



హోననా హోన్నన హోన్నన హోన్నన నచ్చానా
హోననా హోన్నన హోన్నన హోన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా
ధీవరా,ప్రసర శౌర్యా భార,ఉత్సరా, స్ధిర గంభీరా

అలసిస సొలసినా ఒడిలో నిను లాలించనా
అడుగునై నడపనా... నీ జంట పయనించనా
పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా..
సిగముని విడిచినా శిఖరపు జలసిరి ధారల్ని జటాజూటలాం
డీకొని సవాలని తెగించీ నీ వైపు దూసుకొస్తున్నా
ఉగ్రమా అసమ శౌర్య భావ, రౌద్రమా నవ భీతిర్మ/2/

నిలువునా ఎదగరా నిను రమ్మంది నా తొందరా
కదలకే కదనమై గగనానికే ఎదురీదరా
విజితరి పురు ధిరధారా కలిత అసిధ కఠోరా
కులకు ధర తులిత గంభీరా జయ విరాట వీరా
విలయ గగనతల భీకరా గర్జద్దరాధర
హృదయ రస కాసారా, విజిత మధు పారాహార
భయంకరశౌ విభవసింధు సుపరదంగం భరణరందీ
ధీవరా ధరికి చేర రారా
సుందరా చెలి నీదేరా..

Charumati I love you




చారుమతి I Love you
చంద్రముఖి   I Love you
రూపవతీ  I Love You
నేనే నీకు ఏక్ లవ్యూ  a e i o u I Love you..
Love you   Love you

చారుమతి I Love you  చంద్రముఖి   I Love you    


ఎదనే నీవు నిదరే లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె
కునుకే రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లే
అడిగా నిన్నూ... వరమిస్తావా
విడిగా నన్నూ... వదిలేస్తావా
Yes or No?..    Yes or No?   
చారుమతి I Love you  చంద్రముఖి   I Love you  

ఫ్లవరై విచ్చి కలరే ఇచ్చి వికసించావు తొలి ఉహల్లో
చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొలిపేవు నడి జాముల్లో
క్షణమే నేనూ యుగమౌతావా... సఖివై నాకూ సగమౌతావా
Yes or No?    Yes or No?
చారుమతి I Love you  చంద్రముఖి   I Love you


చారుమతి I Love you
చంద్రముఖి   I Love you
రూపవతీ  I Love You
నేనే నీకు ఏక్ లవ్యూ  a e i o u I Love you..
Love you   Love you

చారుమతి I Love you  చంద్రముఖి   I Love you 





Nuvvena Naa Nuvvena



నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..
సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభాతమేనా..
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..

మేఘమల్లే సాగివచ్చి, దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావో
కలలేనా కన్నీరేనా...
తేనెటీగలాగ కుట్టి తీపి మంట రేపుతావో
పువ్వులాంటి గుండెలోనా దారమల్లే దాగుతావో
నేనేనా నా రూపేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..చేరువైనా దూరమైనా ఆనందేమేనా..
ఆనందమేనా.. ఆనందమేనా...
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..

కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావో
ఏ రాగం ఇది ఏ తాళం
మసక వెన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరతావు
గస గసాల కౌగిలింత.. గుసగుసల్లే మారుతావో..
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.., చేరువైనా దూరమైనా ఆనందేమేనా..
ఆనందమేనా.. ఆనందమేనా...
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..



Yamuna Teearam




యమునా తీరం  సంధ్యారాగం /2/
నిజమైనాయి కలలు, నీలా రెండు కనులలో..
నిలువగనే తేనెల్లో పూదారి, వెన్నెల్లో గోదారి మెరుపులతో.. 
యమునా తీరం సంధ్యారాగం 
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో..
నిలువగనే తేనెల్లో పూదారి, వెన్నెల్లో గోదారి మెరుపులతో..
యమునా తీరం సంధ్యారాగం 

ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగా విధీనైనా చేసేదే ప్రేమా..
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమా..
మరువకుమా......
ఆనందం ఆనందం ఆనందమాయాటి మనసుకధా
మరువకుమా.....
ఆనందం ఆనందం ఆనందమాయాటి మనసుకధా
యమునా తీరం సంధ్యారాగం

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం,
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమా
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా
మరువకుమా......
ఆనందం ఆనందం ఆనందమాయాటి మధురకధా
ఆనందం ఆనందం ఆనందమాయాటి మధురకధా
యమునా తీరం సంధ్యారాగం




Vachhe Vachhe


వచ్చే వచ్చే నల్ల మబ్బులారా.. గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా..
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..

పిల్లపాపలా వానా.. బుల్లి పడవల వానా..
చదువు బాధనే తీర్చీ సెలవులిచ్చినా వానా
గాలి వానా కాపాడీ.. వేడి వేడి పకోడీ..ఈడు జోడు డీ డీ డీ తోడుండాలి ఓ లేడీ
ఇంద్రధనుస్సులో తళుకుమనే ఎన్ని రంగులో..
ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో..
శ్రావణమాసాల జల తరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం..
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బులారా.. గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా..


కోరి వచ్చిన ఈ వానా, గోరువెచ్చనయి నాలోనా
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దులాంటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు
గాలివానాల పందిళ్ళు , కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు దాటినా చినుకులతో ఎదురుచూపులా
 నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాల వలపు పందెం
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..
వచ్చే వచ్చే నల్లమబ్బులారా .. గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా..


కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్


గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..






Wednesday, 17 August 2016

Konte Chooputho nee Konte chooputho


కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే

మాట రాని మౌనం మనసే తెలిపే 
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
 కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటే నాలో పలికినది


పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నదీ 
తడబడు గుండెలో మోమాటమిది

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించీ కలలే ముద్రించీ మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించీ నిన్నే శ్యాసించీ నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే  చెంత

 కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటే నాలో పలికినది

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే


Ade Neevu Ade Nenu



అదే నీవు అదే నేను అదే గీతం పాడనా /2/
కథైనా.. కలైనా .. కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా/2/

కొండ కోనా గుండెల్లో ఎండ వానా అయినామూ/2/
గువ్వా గువ్వా గుండెల్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహమూ...అదే మొహమూ../2/
ఆది అంతం ఏది లేని గానమూ
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా.. కలైనా .. కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు/2/
కన్నీరైనా ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశగా/2/
ఎన్ని నాల్లీ నిన్న పాడే పాట పాడను
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా.. కలైనా .. కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా




Eduta Neeve Edalona Neeve


ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం 
తెలిసి వలచుట తొలి నేరం..అందుకే ఈ గాయం /2/

గాయాన్నైనా  మాననీవు... హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు... మరణం నన్ను చేరనీదు
పిచ్చివాడ్ని కానీదు హ హ హ ఓహో హో హఓ ఉ హూ హూ  హూ

ఎదుట నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే

కలలకు భయపడిపోయాను..
నిదురకు  దూరం అయ్యాను
వేదన పడ్డానూ..

స్వప్నాలైతే క్షణికాలేగా,  సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత , సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింతా బలముందా హా హా హా ఓహొ హో హో ఉ హూ హూ  హూ

ఎదుట నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే


Premaledhani Premincharaadani




ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ...
ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ
ప్రేమ లేదనీ ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ... నన్ను నేడు చాటనీ.. ఓ ప్రియా జోహారులూ
ప్రేమ లేదనీ, ప్రేమించరాదని..సాక్ష్యమే నీవనీ...
నన్ను నేడు చాటనీ... ఓ ప్రియా జోహారులూ


మనసు మాసిపోతే మనిషే కాదనీ..కటిక రాయికైన కన్నీురుందనీ..
వలపు చిచ్చు తగులుకుంటె ఆరిపోదనీ..
గడియపడిన మనసు తలుపు తట్టి చెప్పనీ...
ఉసురుకప్పి మూగబోయే నీ ఊపిరీ../2/
మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లల లాలా..

గురుతు చెరిపివేసి జీవించాలనీ..
చెరపలేకపోతే మరణించాలనీ..
తెలిసికూడా చెయ్యలేని వెర్రవాడనీ..
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ...
ముక్కలలో లెక్కలేని రూపాలలో..
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ..

ప్రేమ లేదనీ, ప్రేమించరాదని..ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ..
సాక్ష్యమే నీవని..నన్ను నేడు చాటనీ..ఓ ప్రియా జోహారులూ..
లాల  లాలలా లాలాల లాలల...



Prema entha Madhuram


ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం../2/
చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం..మింగినాను హాలహలం...
ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..

ప్రేమించుటేనా.. నా దోషము..పూజించుటేనా నా పాపము..
ఎన్నాళ్ళనీ ఎదలో ముల్లు.. కన్నీరుగా ఈ కరిగే కళ్ళు
నాలోనీ నీ రూపమూ... నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం...
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం..

నే నోర్వలేనూ ఈ తేజము.. ఆర్పేయారాదా .. ఈ దీపము..
ఆ చీకటిలో కలిసేపోయి... నా రేపటిని మరిచేపోయి...
మానాలి నీ ధ్యానమూ.. కావాలి నే శూన్యము..
అప్పడాగాలి ఈ మూగ గానం..

ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..
చేసినాను ప్రేమా క్షీరసాగర మధనం..మింగినాను హాలహలం...
ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..

Tuesday, 16 August 2016

Manchu kurise velalo



మంచు కురిసే వేళలో... మల్లె విరిసేవెందుకో..
మంచు కురిసే వేళలో.. మనస్సు మురిసేదెందుకో...
ఎందుకో ఎందుకో.... ఎవరితో పొందుకో/2/
మంచు కురిసే వేళలో...

నీవు పిలిచే పిలుపులో... జాలువారే  ప్రేమలో.../2/
జలకమాడి పులకరించే సంబరంలో..
జలదరించే మేనిలో... తొలకరించే మెరుపులో/2/
ఎందుకా వంపులో..ఏమిటా సొంపులో

మంచు కురిసే వేళలో... మల్లె విరిసేవెందుకో..
మంచు కురిసే వేళలో.. మనస్సు మురిసేదెందుకో...
ఎందుకో ఎందుకో.... ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో...

మొలక సిగ్గు బుగ్గలో.. మొదటిముద్దు ఎప్పుడో/2/
మన్మధునితో జన్మవైరం .... చాటినెప్పుడో
ఆరిపోయే పాపము .... అంతు చూసేదెప్పుడో/2/
మంచులేని వెచ్చని గిచ్చులై నప్పుడో

మంచు కురిసే వేళలో... మల్లె విరిసేవెందుకో..
మంచు కురిసే వేళలో.. మనస్సు మురిసేదెందుకో...
ఎందుకో ఎందుకో.... ఎవరితో పొందుకో/2/
మంచు కురిసే వేళలో...





Anasuya kosam


               నీరేమో బంగారూ, ఆల్మోస్ట్ ఇది అమ్మోరూ
అయ్యబాబోయ్ ఏంటి సారూ
ఆదాయం జస్ట్ ఆరు, ఖర్చేమో పదహారూ
మేన్టేనెన్స్ కష్టం బ్రదరూ

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మా
రాశులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్లు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉండేటి బొమ్మా

అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం తన నే పోషించడం ఈసీనా
శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువు కోసం మునగాలిక నిండా మునిగేలా
 లేదంటే నీకు  కనికరమా
నల్లనివాడు మోయతరమా
నువ్వేసే బిల్లు పిడుగమ్మా
కాదమ్మా వల్లకాదమ్మా
హే నీకేమో నేను హిరోషిమా
నీ దాడి తట్టుకోలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కలనే చూపించొద్దమ్మా

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మా
రాశులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్లు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉండేటి బొమ్మా

అవుటింగనీ క్యాంపింగనీ 
ప్రతి రోజు ఏదో న్యూసెన్స్
ఎవరెస్ట్ కి యమ రెస్ట్ కి
ఈ పిల్లే గా ఒక రిఫరెన్స్
అనసూయకీ అనకొండకి 
రెండేగా లెటర్స్ డిఫరెన్స్..

నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే ఇదే ఇదే
ఎత్తే ఎక్కిన యముడికి ఏంజట్ ఇదే ఇదే ఇదే
కరెంట్ కూడా కొట్టనంత షాకు నువ్వే
ఓ రాక్షసి సునామికే బినామి నువ్వూ
మా ఊరికే మూడో ప్రపంచం వార్ నువ్వూ
ప్రేమిస్తావ్    ఎందుకే

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మా
రాశులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిన పూలు ముంచేసినట్లు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉండేటి బొమ్మా


                 

Rang de




నలుపు తెలుపు నా కాటుక కళ్ళకీ
రంగు రంగు కలలిచ్చినదెవ్వరూ
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మర్చినా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరూ
బుగ్గ నలుపులో ఎరుపై వచ్చిందెవరూ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించూ నీ ఇష్టం

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే 

రంగ్ దే రే. రంగ్ దే రే
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే
ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించూ నీ ఇష్టం

నీలి మేఘం నెమలి పింఛం
రెంటికి లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడతీయలే

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే

ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ

రామబాణం సీత ప్రాణం
జన్మలెన్నైనా నీతో ప్రయాణం
రాధా ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే

ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ












Yaa Yaa



హే రాములుగా... బుగ్గల వాడా బురుజు కోట
విప్పరారా కండలవాడా
రాజపేట లాకుల కాడా కలుసుకుంటా
గాజుల పేరు పట్టకరారా
అల్లా భక్షు  అత్తరు తెచ్చా
కొత్తపేట కోక రైక కట్టుకొచ్చా
రంగవెల్లె రైలుబండి రయ్ మంది
పెట్టె బేడా పట్టుకొచ్చా

నిద్దరచాలని బద్దకమల్లె వళ్ళిరించిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం
వెలుతురు మోస్తు దిగివస్తున్నది గాలిలో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికుడల్లే స్వాగతమంది పచ్చదనం

మౌనంగా ధ్యానంలో ఉంది.... మా గానం
చిట్టి వడ్రంగి పిట్టలాగా బిక్కు బిక్కు
బొమ్మ రంగాల్లో మైనాల కుహు కుహు
ఇది పల్లెకు తెలిసినా మెలోడిగా..

యా.. యా... యా.. యా..
యా యా యా యా /2/

అయ్య.... ముగ్గులు ముంగిల్లు
అయ్య.... ప్రేమలు నట్టిల్లు
అయ్య....చూడరా చాల్లే నా రెండు కళ్ళు
అయ్య...పవ్వులు పుప్పొడ్లూ
అయ్య....పంటలు నూర్పిడ్లు
అయ్య....పండగలు తిరణాల్లు
ఈ పచ్చగాలి జోలలు నచ్చనోళ్ళు లేరటా

కళ్ళాపి జల్లి రాయండే రంగమ్మ
కవ్వాలే తిప్పాలి కానీవే గంగమ్మ
మావిళ్ళు పోయాలి కదమింత ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాన్ది ఇంక ఆలస్యమా

యా.. యా యా యా
యా యా యా యా
యా యా యా యా
యా  యా యా యా

గోపాల గోపాల అలకేలరా
నీ పాట వేళాయే అగుపించరా
గోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచనా
చేరని మనసిది క్షమించునా
నిన్నటి మొన్నటి రోషములెరుగను
చల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కునచేర్చి లాలించనా
నెమ్మది చెదిరినా అమ్మని చూడరా
బిరగా రా రాదు రా...

గోపాల గోపాల 
గోపాల గోపాల
అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా....



Tikku Tikkantu



టిక్కుటిక్కంటూ చేతీకి గడిపెట్టీ
టింకు టాకూ నా కండ్లకి ఐనా పెట్టి
కోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో
ఎంకటేశో ఎంకటేశో
ఎంకటేశో దగ్గుబాటి బాసో
బాబు అచ్చమైన బంగారు పోలిసూ
ఎంకటేశో దగ్గుబాటి బాసో
బాబు అచ్చమైన బంగారు పోలిసూ

ఎర్రఎర్రనీ చీరేమో ఎగ్గట్టీ
గుప్పుమంటున్న మల్లెలు, కొప్పున పెట్టి
నల్ల నాగులెక్క నడుము తిప్పుతున్నవే..

నాగులమ్మా నాగులమ్మా 
నాగులమ్మా గున్నమామి కొమ్మా
గుండె గోడమీద అచ్చయిందే బొమ్మా
సిటికెలేత్తంటే ఉడుకుమని నా చీర
సీటీకోడతంటే సీకటింటా తెల్లారా
గుడ గుడ అందమంతా గుటకలెక్కా తాగరా

ఎంకటేశో ఎంకటేశో
ఎంకటేశో దగ్గుబాటి బాసో
బాబు అచ్చమైన బంగారు పోలిసూ
ఎంకటేశో దగ్గుబాటి బాసో
బాబు అచ్చమైన బంగారు పోలిసూ

లక్ష్ సబ్బెట్టి నైలాక్ష్ చీర కట్టి
గ్లాసూ సెంటు కొట్టి హైటెక్ష్ కాటుకెట్టి
నిన్ను నేను సూత్తుంటే మీటరింకా తిరిగెనే
నాగులమ్మా నాగులమ్మా 
నాగులమ్మా గున్నమామి కొమ్మా
గుండె గోడమీద అచ్చయిందే బొమ్మా



Raaka Raaka



       వాట్ ఎ ఫీలింగ్
వాన్నా గో డాన్సింగ్
కలలో నిజమే కలిసింది
నలు దిక్కులో ప్రేమే ఉన్నా
లవ్లీ ఐలాండ్ పిలిచింది

రాక రాక వచ్చింది 
రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాల ధరహాసం

ఉన్న చోటే గొడుగైయింది
నన్ను చేరి ఆకాశం
సన్నజాజి ఒడుగైయింది
నిండు భూమి నా కోసం

తననననంతమ్ ఇష్క్ వసంతం
నువు నా సొంతం బంగారం
ప్రతి ఒక నిమిషం
పెదవుల మోగే లవ్లీ Anthem నీ పేరు/2/

రాక రాక వచ్చింది 
రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాల ధరహాసం

ఉన్న చోటే గొడుగైయింది
నన్ను చేరి ఆకాశం
సన్నజాజి ఒడుగైయింది
నిండు భూమి నా కోసం

రెండు అక్షరాల పోలికా
చిన్నదే చాలదే
అంతకన్నా ఎక్కువే ఇది
జన్మలో తీరదే
మాటల్లో అంటేనే
వినిపించేనే నీలో ఇష్టం
లేదంటే నీలో నీ ప్రాణం
 ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం
నీ పైనా ఈ అనురాగం

తననననంతమ్ ఇష్క్ వసంతం
నువు నా సొంతం బంగారం
ప్రతి ఒక నిమిషం
పెదవుల మోగే లవ్లీ Anthem నీ పేరు/2/

కాలమంటూ గుర్తు రాదని నిన్నిలా చూడనీ
నువ్వు తప్ప నాకు వేరుగా లోకమేలేదనీ
ఆరారు ఋతువులను వస్తే రాని పోతే పోనీ
నీ కలలో ముల్కవాని  ప్రయాణాన్ని


పరువాల వెన్నెలా నిన్ను చూస్తే కేరింతవనీ
నా ఊపిరి సంద్రాన్ని

రాక రాక వచ్చింది 
రంగుపూల మధుమాసం
గుండెలోన గుమ్మంది
చందనాల ధరహాసం

ఉన్న చోటే గొడుగైయింది
నన్ను చేరి ఆకాశం
సన్నజాజి ఒడుగైయింది
నిండు భూమి నా కోసం

తననననంతమ్ ఇష్క్ వసంతం
నువు నా సొంతం బంగారం
ప్రతి ఒక నిమిషం
పెదవుల మోగే లవ్లీ Anthem నీ పేరు/2/




Snehithudo



స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేశాడూ
ఆకాశం తెచ్చేశాడూ
అడగకముందే అందించే సాయం ... ఇతడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం 
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం 
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగిందా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బులా విసిరిందా

మండుతున్న ఎండలోన
నీడ కాసే.. గొడుగు వీడే
చేదు నిండే గుండెలోనా
తీపి పుట్టే కబురు వీడే
ఏ చిన్ని గాయం నీ మీదున్నా
మోసే హృదయం ఇతడు
పసివాడీ కన్నులతోనా లోకాన్నే చూస్తాడు
దండిచే వాడికి తానే
గుండెలోతు కూడా ప్రేమా అందిస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

రాతలోనా గీతలోనా భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా సంబరాలే తెచ్చినాడు

నీ చిన్ని చిన్ని సరదాలన్నీ తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయము లేకున్నా ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్ళిపోతున్నా పండగలని చెవులు తిప్పి లాకొస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం 
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం 
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బులా విసిరిందా


                                  

Malleal Vaanala



                 
               మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
మనసే మనిషై పుట్టేసిందే నీలా ఇలా
ముద్దొస్తుందే నీలో హ్యుమానిజం
అచ్చై పోయే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్టతొలి చూపులో
నా కంటి కలకు పొద్దెన్నీ కలలో
పడిపోయే నీ ప్రేమలో

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
పడిపోయా నీ ప్రేమలో..

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

ఇన్నాళ్లు ఏమయ్యావే ఏ దిక్కున దాక్కునావో
ఇవాల్లే ఇంతదంగా నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టావో వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పలో ముత్యంలాగా స్వచ్చంగా మెరిసేవో
అందానికి హుందాతనము జత చేరినా
దేవతలా నడిచోచ్చావు నేల బారునా
ఆకర్షించే కొత్త కొంగొడుగా
నే ఫిదా అయ్యానే

నాలాగా నువ్వంటా నీలాగా నేనంటా
అనుకోకుండా ఇలా కలిసింది మా జంట

నీ ఇంటి పేరే జాలి
నీ మాటే చల్ల గాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళీ
నువ్వే నా రంగుల హోలీ
నీ గుండెల్లోన ఖాళి నీతోనే నిండాలి
సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పాటలా
మదర్ దెరిస్సాలోని మంచి మాటలా
చుట్టు ముట్టావే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయ్యా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
పడిపోయా నీ ప్రేమలో..

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా