Saturday, 4 February 2017

ముత్యాలు వస్తావా





ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారి

చలమయ్యా వస్తాను 
ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయ్యా

నీ జారు పైట ఊరిస్తు ఉంది
నీ  కొంటెం చూపు కొరికేస్తు ఉంది
కన్ను కన్ను ఎప్పుడో కలిసింది

ఎందయ్యా గోల సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా
నిన్ను నిన్ను చూస్తే నామరదా

పర్మినెంటుగాను నిన్ను చేసుకుంటాను
ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకుని ఉంటాను

ఏరు దాటి పోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదిలిపెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో

ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారి

చలమయ్యా వస్తాను 
ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయ్యా

ఏమిటి ఈ అవతారం



ఏమిటి ఈ అవతారం
ఎందుకు ఈ సింగారం
పాత రోజులు గుర్తొస్తున్నావి
ఉన్నది ఏదో వ్యవహారం

చాలును మీ పరిహాసం
ఈ సొగసంత మీ కోసం

పౌడరు తెచ్చెను నీకందం
బాగా వెయ్ వెయ్ వెడు మందం/2/
తట్టెడు పూలు తలను పెట్టుకొని 
తయారవితివా చిట్టి వర్ధనం

చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం

వయసులోనా నే ముదురుదాననా 
వయ్యారానికి తగనిదాననా
వరుస కాన్పులయి వన్నె తగ్గినా 
అందానికి నే తీసిపోదునా

ఏమిటి నీ అపరాధం
ఎందుకు ఈ వ్యవహారం

దేవకన్య ఇటు దిగివచ్చిందని
మరచి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎప్పుడైనా

చాలును మీ పరిహాసం
ఈ సోగసంతా మీ కోసం

నీళ్ళు కలపని పాలవంటింది 
పిండి కలపని వెన్నవంటింది
నికార్సయినది నా మనసు
ఊరు వాడకి ఇది తెలుసు

ఏమిటి ఈ వ్యవహారం

చాలును మీ పరిహాసం







Oka paru mugguru devadasulu




ఒక సాదా సీదా పోరి ఉంది
ఆ పోరికి ఒక దిల్ ఉంది
అరె ఒకరికి ఒక దిల్ కాకపోతే రెండు మూడు ఉంటాయా
ఏమాట్లాడుతున్నవ్ ఏం పాడుతున్నవ్ నోటికొచ్చింది పాడుడేనా
హే
చప్పుడు చెయ్యకుండా చెప్పింది వినవో

దాని బర్త్ డేటు మూడు
దాని బర్త్ మంత్ మూడు
దాని రోడ్ నెంబర్
రూమ్ నెంబర్
బెంచ్ నెంబర్
బెర్త్ నెంబర్
లక్కీ నెంబర్ మూడు

ఆ.. దాని వేకప్ టైమ్ మూడు
దాని లంచ్ టైమ్ మూడు
దాని సెల్ నంబర్
ఇల్లు నెంబర్
ప్రేమలోని అక్షరాలు టోటలేస్తే మూడు
ఒక్క సీసాకి ఒక్క మూత
ఒక్క సినిమాకి ఒక్క పేరు
ఒక్క సీతకి ఒక్క రాముడు
అరే హిస్టరిలో ఏడ లేని లవ్ స్టోరి నడుపుతుంది
కళ్ళ ముందు చూడు చూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు 
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనార్ ముగ్గురు సలీములు

ఫేసుబుక్ లోనా గుడ్ మార్నింగ్ కి ఒకడు
వాట్సప్ లోనా గుడ్ నైట్ అంటు ఒకడు
నీ స్టైల్ సూపర్ అంటు సొల్లు కొట్టనీకి  ఒకడు
డ్రీమ్ గర్ల్ నువ్వేనంటు  పొగడనీకి ఒకడు
సినిమాకి ఒకడు 
షాపింగ్ కి ఒకడు
లాంగ్ డ్రెవ్కి ఇంకోకడు
దాని గారఢీలు చూస్తే నాకు బీరులెన్నీ తాగుతున్నా తాగునట్టు లేదు  సూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు 
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనార్ ముగ్గురు సలీములు

అరే ఐస్ క్రీమ్ పార్లర్ కి తీస్కపోనికొకడు
ఆ బ్యూటిపార్లర్ కి తిప్పనీకి ఒకడు
కాఫీడే లో టైమ్ పాస్ చెయ్యనీకి ఒకడు
కాలేజ్ డ్రాపింగ్  పికప్ కి ఒకడు
రాచార్జ్ కి ఒకడు
రికార్డు కి ఒకడు
రిఫ్రెష్ కి ఇంకొకడు
దీని లవ్ గేమ్ చూస్తే నాకు దిమ్మ తిరిగి పోయి నాకు
మెంటల్ ఎక్కుతుంది చూడు

ఒక పారు ముగ్గుర దేవదాసులు
ఒక లైలా ముగ్గురు మజ్నులు 
ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు
ఒక అనార్ ముగ్గురు సలీములు













Friday, 3 February 2017

టక్కరిదానా



టక్కరిదానా టెక్కుల దానా
టక్కరిదానా టెక్కుల దానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే

తుంటరి రాజా తింటావు కాజా
తుంటరి రాజా తింటావు కాజా
ఒంటిగా చేసి కొంటెంగా చూసి వెంటను పడతావా

మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా/2
ఈ బూటకమాడి నాటకమాడే వాటము చాలోయి/2
తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు కాజా

టక్కరి టక్కరి టక్కరి టక్కరి దానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల దానా

చీరలు ఇస్తా సారెలు తెస్తా చిర్రుబుర్రుమనకే/2
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే/2

టక్కరి టక్కరి టక్కరి టక్కరి దానా
టెక్కుల టెక్కుల టెక్కుల టెక్కుల దానా

చీరలు ఏల గారెలు ఏల బేరాల మాటేలా
నే కోరిన వాడే చేరువ కాగా కొరత ఇంకేలా

తుంటరి తుంటరి తుంటరి తుంటరి రాజా
తింటావు తింటావు తింటావు తింటావు కాజా

బూరెలు చేస్తా గారెలు చేస్తా బూంది చేస్తానే/2
వద్దనను మన పెళ్ళికి నేనే వడ్డన చేస్తానే/2

టక్కరిదానా టెక్కుల దానా
టక్కరిదానా టెక్కుల దానా
చుక్కలకన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే











సోడా బీడి బీడా




సోడా బీడి బీడా 
సోడా బీడి బీడా
ఈ మూడు వాడి చూడు తేడా/2/

జాడి బీడి కాల్చరా బాబా అదియే ఎర్ర మతబా/2
అన్నం దొరకని బ్రదరా ఇదిగో సున్నం బీడా తినరా
కమ్మగా తాగరా సోడా షరబత్ కనిపిస్తుంది మొహబత్/2
కలిగిస్తుంది కుషామత్

నీ సొమ్మంతా ఇంట్లో దాచి దోస్తుల దగ్గర చేతులు జాచి/2
అందినవన్నీ జల్సా చెయ్యి అప్పులవాళ్ళకు టోపి వెయ్యి/2

సోడా బీడి బీడా 
సోడా బీడి బీడా
ఈ మూడు వాడి చూడు తేడా

తాతకు సోడా ఎంతో పసందు , కడుపునొప్పికి భలే మందు/2
బీడి తాగిన వాడేనండి కనిపెట్టెను పొగ బండి/2
కిళ్ళి వెయ్యి తాతయ్యా మళ్ళి యవ్వనమొస్తుందయ్యా
తాతయ్యా
కిళ్ళి వెయ్యి తాతయ్యా మళ్ళి యవ్వనమొస్తుందయ్యా

ఈ మూడు వాడి చూడు తేడా
సోడా బీడి బీడా 
సోడా బీడి బీడా






అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని/2/

అయినా కుదరుగా ఎదుట కూర్చని గాలి గట్టిగా పిల్చుమా
స్వామి స్వామి..
ఏమి ఏమి
నేను పిల్చిన గాలి నిలువక ఆకటా మీపై విసిరెనే..
ఆకట మీపై విసిరెనే.
అందుకే మరి
అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని

అయిన కన్నులు మూసి చూపును ముక్కు కొనపై నిలుపుమా
స్వామి స్వామి..
ఈ మారేమి
ఆచట నిలువకా చూపులన్నీ అయ్యో మీ పై దూకెనే
అయ్యో మీ పై దూకెనే
అదేమరీ

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని








Mundarunna Chinnadani




ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
 దాగిపోయే /2/

పొందుగోరు చిన్నవాని తొందరేమో..
మూడుముళ్ళ మాట కూడా మరచిపొయే...
తోచదాయే

పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో....
పైటకొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేననీ/2
చెమరించు నీ మేని తెలిపెలే
పొందుగోరే చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే
తోచదాయే

కొంటె చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నె మనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరిఅయిన సమయం రాలేదులే /2
మనువైన తొలిరేయి మనదిలే

ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
 దాగిపోయే

ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరునీ  విరహాలు /2/

కాదన్న వారు ఔనన్ననాడు 
కౌగిళ్ళ కరిగేది నిజములే..

ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
 దాగిపోయే

పొందుగోరే చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే
తోచదాయే











Nadireyi Ye Jamulo




నడిరేయి ఏ జాములో స్వామి 
నిను చేర దిగివచ్చునో
 తిరుమల శిఖారాలు దిగివచ్చునో /2/

మముగన్న మాయమ్మా అలివేలుమంగమ్మా/2/
పతిదేవు ఒడిలోన మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుతో మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా....
మముగన్నమాయమ్మా అలివేలుమంగా........./2/
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుతో మా మనవి వినిపించవమ్మా


కలవారినే గాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ  అనురాగవల్లీ
అడగవే మా యమ్మా అలివేలుమంగా

నడిరేయి ఏ జామునో 
స్వామి నిను చేర దిగి వచ్చునో













Ennaallo Vechina




ఎన్నాళ్ళో వేచిన హృదయం 
ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్ళు దాచిన హృదయం
ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి 
ఈ చీకటి విడిపోదేమి /2/

మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమి చేయదనీ
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదనీ
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే   /ఇంకా

నాగులు తిరిగే కోనలో , ఏ న్యాయం పనికిరాదని /2/
కత్తిని విసిరేవానిని ఆ కత్తితోనే గెలవాలనీ
నేనెరిగిన చేదు నిజం
నీతో చెప్పాలని వస్తే   /ఇంకా

ఎన్నాళ్ళో వేచిన హృదయం 
ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్ళు దాచిన హృదయం
ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి 
ఈ చీకటి విడిపోదేమి 






Evaro Vastarani




ఎవరో వస్తారని ... ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరిచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూర్లలో 
చదువు రాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్ రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని .. ఏదో మేలు చేస్తారని 
ఎదురు చూసి మోసపోకుమా /ఎవరో


చాలిచాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని 
ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా /ఎవరో

తరతరాల మూఢాచారాపు వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి , బలియైపోయే పడతులకూ
ఎవరో తోడు వస్తారని 
ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

కూలి డబ్బుతో లాటరీ టికెట్ .. లాటరి టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో భాద్యత నుండి చెడే నిరాశ జీవులకు /ఎవరో తోడు


సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా ఫలితం దక్కని దీనులకు /ఎవరో తోడు





Mukkoti Devathalu




ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కనీ పాపనీ ఇక్కడుంచారు
ఎక్కడున్నా గాని దిక్కువారే గదా
చిక్కులను విడదీసి దరిచేర్చలేరా /ముక్కోటి

ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలివేలు మంగపతి అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు
దోగాడు బాలునికి తోడునీడవుతాడు /ముక్కోటి

నెల్లూరి సీమలో చల్లంగా శయంనించు
శ్రీ రంగ నాయకా ఆనంద దాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునకు శరణం
దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా /ముక్కోటి

ఎల్లలోకాలకు తల్లివై నీవుండ
పిల్లవానికి ఇక తల్లి ప్రేమా కొరత
బరువాయే బ్రతుకు చెఱువాయే కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గా..

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కటి పాపను ఇక్కడుంచారు

గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా ....
నిన్ను నమ్మిన , కోర్కె నేరవేరునయ్యా
చిన్నారి బాలునకు శ్రీ రామ రక్షా

బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా వేరు దైవము లేడూ
అంతుతెలియగ రాని ఆవేదనలు కలిగే
చింతలను తొలగించు సింహచలేశా

మొండిచేతులవాడవెందుకైనావంటే
చేతికెముకయే లేని వాడవని చాటుటకే
నీ రధము కదిలితే శుభము నొసగూరేను
జీవపధమును మార్చు శ్రీ జగన్నాధా







neeli meghalalo



నీలి మేఘాలలో... గాలి కెరటాలలో...
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునే  వేళ

ఏ పూర్వ పుణ్యమో .. నీ పొందుగా మారి/2/
అపురూపమై నిలచే నా అంతరంగాన /నీలి

నీ చెలిమిలో నున్న.. నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే.. మరపింపజేయు/నీలి

అందుకోజాలనీ ఆనందమే నీవు
ఎందుకే చేరువై .. దూరమైతావు 

నీలి మేఘాలలో గాలి కెరటాలలో 
నీవు పాడే పాట వినిపించునే వేళ






Kala Idhani




కల ఇదనీ నిజమిదనీ 
తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ... /2/

పసితనపు మనోరధం 
వెన్నెల నీడై పోయేనులే
బ్రతుకింతేనులే /2/

ఏమియో మురిపాలెటకో పయనాలు
దైవాల నీ మాలింతే  ఏ... /2/
వరమింతే 
చివురించిన పూదీవే.. విరియగా...
విరితావులు దూరాలై చనేనులే
ప్రేమ ఇంతేలే
 పరిణామమింతేలే/ కలఇదనీ

నెరవేరనీ ఈ మమకారాలేమో ఈ దూరాభారలేమో/2/
హితవేమో 
ఎదినేరని ప్రాయాన
తనువునా
రవళించిన రాగమ్మే స్థరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే










O Devada




ఓ .... దేవదా
ఓ.....పార్వతి
చదువు ఇదేనా మన బాషే వదిలేసి 
అసలు దొరల్లే సూటు బూటా

పల్లెటూరు పిల్లకు కులుకు ఎచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయిందే బాగు బాగు

ఓ... పార్వతి...

ఉన్న తీరు మారినా    ఊరు మారినా
తమరు ఎన్నటికి పసివారేనో...

అలనాటి కలలన్నీ వెలుగులైయ్యేనా
నిజమయ్యేనా

ఓ ....పార్వతి

నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి



ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మూట





Palleku Podaam



పల్లెకు పోదాం పారుని చూద్దాం ఛలో ఛలో..
అల్లరి చేద్దాం ఛలో ఛలో

ప్రొద్దు వాలి ముందుగానే ముంగిట వాలేము

ఆటా పాటలందు
కవ్వించు కొంటెం కోణంగీ
మనసేమో మక్కువేమో
వగవేమో అదేమో
కనులార చూతము...

నన్ను చూడగానో 
చిననాటి చనువు చూపేనో
నాదరికి దూకునో..
తానలిగి పోవునో
ఏమవునో చూద్దాం

పల్లెకు పోదాం పారుని చూద్దాం ఛలో ఛలో 
అల్లరి చేద్దాం ఛలో ఛలో 
ప్రొద్దు వాలే ముందుగానే ముంగిట వాలేము

Kudi Edamaithe



కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ 
ఓడిపోలేదోయ్ .....ఓ...ఓ /2/
సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్

మేడలోని అల పైడి బొమ్మా
నీడనే చిలకమ్మా...
కొండలే రగిలే వడ గాలి
నీ సిగలో పూవేనోయ్

చందమామా మసకేసిపోయే
ముందుగా కబురేలోయ్
లాహిరి నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్


Cheliya Ledu



చెలియా లేదు చెలిమి లేదు/2/
వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే/2/
మిగిలింది నీవేనే

చెలిమి పోయే చెలుగు పోయే 
నెలవే వేరయా
చేరదీసి సేవ చేసే తీరు కరువాయే
నీ దారే వేరాయా

మరుపురాని బాధ కన్నా
మధురమేలేదూ
గతము తలచి వగచే కన్నా
సౌఖ్యమే లేదూ
అందరాని పొందు కన్నా అందమే లేదు
ఆనందమే లేదూ /చెలిమి

వరదపాలవు చెరువులైన పొడలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలే జాడేలే
దారి లేని బాధ తో నే ఆరిపోయేనా
కధ తీరి పోయేనా


Thursday, 2 February 2017

Andaala Aanandam Indenaya



అందాల ఆనందం ఇందేనయ్యా/2/
అందం చూడవయ్యా ఆనందించవయ్యా/2/
కొంగారే సోయగము రంగు చేయగా/2/
రంగ రంగేళిగా ఆడి పాడేనయా/2/  

ముల్లోకలా లేని సల్లాపలా 
ముంచి తేల్చేసి లాలించేనయ్యా
పూల జంపాలలో తూగుటుయ్యాలలో
నీడగా జోరుగా ఆడిపాడేనయ్యా /అందం

వాసాలలో సహవసాలలో చిద్విలాసాలలో జాణనయ్యా/2/
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా 
హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా /అందం


Jagame Maya



జగమే మాయ బ్రతుకే మాయ 
వేదాలలో సారమింతేనయా /3/

కలిమి లేములు కష్టసుఖాలు 
కావడిలో కుండలనీ భయమేలోయీ
కావడి పోయ్యేనోయ్ కుండలు మన్నేనోయి
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయీ/ జగమే

ఆశ మొహముల దరి రానికోయి/2
అన్యులకే నీ సుఖము అంకితమోయి/2
బాధ సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ ఏరుకే నిత్య ఆనందమోయ్, బ్రహ్మానందమోయి

Ratthaalu Ratthaalu




Boss is Back  Get Ready

For Deadly Dance Get Ready

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బొత్తాలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే 
మనసే రైలు పట్టాలు


నీ ఒంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు
చంగుమంటు రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
మాస్ డ్యాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపినా పిస్తోలు/రత్తాలు/

నీ నవ్వులే రత్నాలు
నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు

నీ చేతులే మాగ్నెట్ లు 
నీ  వేళ్ళు వీణ మెట్లు
నువు తాకుతుంటే రక్తమంతా రాగాలూ

నువ్ పక్కనుంటే కిక్కే వేరు
వద్దులే జర్దాలు
ఆవురావురంటు ఉన్నా
తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా 
రఫ్ ఆడిస్తా రాత్రి పగలు
మాస్ డ్యాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టీ పట్టీలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు

బాస్ చూపియ్ నీ గ్రేసు

హే మైడియర్ బాసు నువు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే సింహమయిన నీతో దిగదా సెల్ఫీలూ

హే మిస్ యునివర్స్ లాంటి నీ ఫీచర్స్
చూస్తు ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోని గుర్రాలు

నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూజ్ కంట్రోల్
నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు
నాకు నువ్వు నీకు నేను అప్పచెబుదాం పాటాలు
మాస్ డ్యాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు