రాళ్లనెక్లేసు పెట్టేటిదాననురా /3/
రాగి ఉంగరాల రాత రాసినావురో
మందులోడో మందులోడో మందులోడో
ఓరి మాయలోడా మామా రారో ఓరి చిన్నవాడా
మాట మాటకు మాటిమాటికి మాట మాటకు మందులోడంటావే
మందులోడన్న సంగతి ముందెరెక వంటే
నాంచారమ్మో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీద బొమ్మా/2/
మేడ మిద్దెల్లో బతికేటి దాననురా
పూరి గుడిసెలో రాత రాసినావురా
మందులోడా మందులోడా మందులోడా
ఓరి మాయలోడా మామా రారో నా చిన్నవాడా
మాట మాటకు మాటిమాటికి మాట మాటకు మందులోడంటావే
మందులోడన్న సంగతి ముందెరుక వంటే
నాంచారమ్మో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీద బొమ్మా/2/
సిలుకు చీరలు కట్టేటిదాననురా
చిరిగిన చీరలోన రాత రాసినావురా
మందులోడా మందులోడా మందులోడా
ఓరి మాయలోడా మామా రారా ఓరి చిన్నవాడా /మాట మాటకు/